ఊహకు అందని కథనం చూస్తారు
‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘సీతారామం’. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న నాయికలుగా నటించారు. స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్శిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకుడు. యుద్ధం నేపథ్యంలో భావోద్వేగాలు నిండిన ప్రేమ కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు దుల్కర్ సల్మాన్.
‘సీతా రామం’లో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేమిటి?
పీరియాడిక్ చిత్రమిది. నేను ఇలాంటి కథను ఇప్పటిదాకా వినలేదు. ఊహకు అందని కథనం ఉంటుంది. ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ఇష్టపడతారని అనుకుంటున్నాను. సినిమా అంతా వాస్తవికతతో సాగుతుంది. ఒక రియల్ క్లాసిక్ మూవీగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ట్రైలర్లో మీరు చూసింది కొంతే..సినిమాలో చాలా ఆకర్షణలు ఉంటాయి.
ఈ ప్రేమ కథలో వైవిధ్యం గురించి ఏం చెబుతారు?
ప్రేక్షకులకు కొత్తదనం అందించే సినిమాల్లో నటించాలని అనుకుంటాను. ఏ కథ విన్నా, సినిమా ఒప్పుకున్నా ఈ కోణంలోనే ఆలోచిస్తా. ఇదొక పొయెటిక్ లవ్ స్టోరి. నాకు రొమాంటిక్ హీరో అనే పేరు ఉంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ లవ్‌స్టోరీ అందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. నాకు ఇదొక ప్రత్యేకమైన సినిమా.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించాను. అతనొక అనాథ. అయితే తనకెవరూ లేరని ఎప్పుడూ బాధపడడు. అందరితో సరదాగా ఉంటాడు. రామ్‌కు దేశభక్తి ఎక్కువ. విధి నిర్వహణలో ధైర్యంగా ముందుకు సాగుతాడు.
దర్శకుడు హను రాఘవపూడి గురించి..?
సినిమాలను బాగా ఇష్టపడే దర్శకుడు హను. ఆయన కథ చెబుతున్నప్పుడే సినిమా మేకింగ్ పట్ల ప్యాషన్ కనిపించింది. జయాపజయాల గురించి పక్కనపెడితే సినిమా రూపకల్పనలో హను రాఘవపూడి ప్రేమ, తపన కనిపిస్తుంది. ఈ సినిమాలోని కీలక పాత్రలకు తమిళం, తెలుగు, బెంగాలీ ఇలా వివిధ భాషల నటీనటులను ఎంచుకున్నారు. వీరందరితో సెట్ కళగా ఉండేది. ప్రతి పాత్రకూ ఒక ప్రాముఖ్యత ఉండేలా హను జాగ్రత్తపడ్డారు.
మృణాల్ ఠాకూర్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది?
కొన్ని క్లాసిక్ నవలలు చదువుతుంటే కొన్ని పాత్రలు ఇలా ఉంటాయేమో అని ఊహించుకుంటాం. ఈ కథ విన్నప్పుడు సీత పాత్రను కూడా అలాగే ఊహించుకున్నా. మృణాల్ ఈ పాత్రగా మారిపోయింది. సీత పాత్రకు ఆమే సరైన ఎంపిక అనిపించింది. అంత బాగా నటించింది. రష్మిక మందన్న ఒక వైవిధ్యమైన పాత్రలో నటించింది. ఆమె ఇలాంటి పాత్ర ఇప్పటిదాకా చేసి ఉండదు. ఆమెతో నాకు సన్నివేశాలు ఉన్నాయా లేదా అనేది సినిమాలోనే చూడాలి.
ఈ కథలో పాటలకున్న ప్రాధాన్యత ఎలాంటిది?
ఈ సినిమాలో పాటలు ఇప్పటికే శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. కానున్న కళ్యాణం పాట చిత్రీకరణ, ఆ పాట నేపథ్యం చూశాక సంతృప్తిగా అనిపించింది. 80వ దశకంలోని తరహాలో పాటలను కంపోజ్ చేశారు. అన్ని పాటలూ నాకు ఇష్టమే. సినిమాలో నేపథ్య సంగీతమూ బాగుంటుంది.
చాలా ఎంపికగా సినిమాలు చేస్తుంటారు ఎందుకని?
నా పదేళ్ల కెరీర్లో 35 సినిమాల్లోనే నటించాను. తోటి హీరోల్లో పోల్చుకుంటే నేను చేసినవి తక్కువ చిత్రాలే. మిగతా హీరోలు ఏడాదికి 12 చిత్రాల్లో నటించేవారున్నారు. మా నాన్న సంవత్సరానికి 30 చిత్రాల్లో నటించిన సందర్భాలున్నాయి. ఇకపై కాస్త వేగాన్ని పెంచాలనుకుంటున్నా.
పాన్ ఇండియా సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి?
పాన్ ఇండియా మూవీ అనే మాట తరచూ వింటున్నాం. ఇది ఫిలిం ఇండస్ట్రీకి కొత్తది కాదు. గతంలో రజనీకాంత్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ చిత్రాలు దేశ విదేశాల్లో విడుదలై ఆదరణ పొందేవి. సినిమాను సినిమా అని పిలిస్తే చాలు అనేది నా అభిప్రాయం. భవిష్యత్‌లో దర్శకత్వం చేయాలని ఉంది. ఆ సినిమా సరికొత్త కాన్సెప్ట్‌తో ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

