Bhagwant kesari | టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి (Bhagwant kesari). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. పెళ్లి సందD ఫేం శ్రీలీల, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ (Arjun rampal) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రం బాలకృష్ణ సోదరుడు, దివంగత హరికృష్ణ నటించిన స్వామి (Swamy) చిత్రానికి రీమేక్‌గా వస్తుందని నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. భగవంత్ కేసరి రీమేక్ కాదని, ఒరిజినల్ స్టోరీలైన్‌తో వస్తుందని తెలియజేశారు. బిగ్ స్క్రీన్‌పై బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడని అవతార్‌లో చూసి మూవీ లవర్స్, అభిమానులు అక్టోబర్ 19న పండగ చేసుకోవడం గ్యారంటీ.. అని తెలియజేశారు. ఇప్పటికే ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని.. కొన్ని ఫొటోలను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలకృష్ణ కెరీర్లో ఇప్పటివరకు రాయలసీయ యాసలో అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాడని తెలిసిందే. అయితే ఇప్పుడు భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఊరమాస్ ట్రీట్ అందివ్వబోతున్నాడని టీజర్‌తో అర్థమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Not true 🙂
The Real Truth is that, Oct 19th will be MASSIVE ❤️🔥❤️🔥
&
Everyone will celebrate NBK LIKE NEVER BEFORE on Big Screens😎🔥#BhagavanthKesari https://t.co/pm4uyHf1Rb— Shine Screens (@Shine_Screens) August 14, 2023
భగవంత్ కేసరితో అర్జున్ రాంపాల్..
It’s a wrap for me on my film #bhagwantkesari I was so nervous when I came here to shoot my first Telugu film. I can confidently say now have had an absolute blast filming it. All this would not have been possible without the energy of my big brother #balakrishna thank you bro… pic.twitter.com/urHmQeQ070
— arjun rampal (@rampalarjun) August 14, 2023
భగవంత్ కేసరి టీజర్..