Dil Raju | నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఓటీటీ రంగంలోకి దిగబోతున్నారని కథనాలు వచ్చాయి.`మ్యాంగో` (Mango)తో కలిసి దిల్ రాజు ఓ కొత్త ఓటీటీ సంస్థని స్థాపించే ప్రయత్నాలు చేస్తున్నారని, దాదాపు 25 చిన్న సినిమాల్ని ఒకేసారి నిర్మించాలని భావిస్తున్నారని, ఒక్కో సినిమాకీ దాదాపు 5 కోట్లు పెట్టుబడి పెట్టే ఆలోచన చేస్తున్నారని, 2024లో ఈ ఓటీటీ సంస్థ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తుందని కథనాలు వినిపించాయి.
అయితే ఈ కథనాల్లో వాస్తవం లేదు. ఈ వార్తలను దిల్ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఖండించింది. నిర్ధారణ కాకుండా వార్తలను ప్రచురించవద్దని కోరింది. `మా నిర్మాత దిల్‌రాజు ఓటీటీ ఫ్లాట్‌ఫాంను తీసుకొస్తున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. నిర్ధారణ కాని వార్తలను దయ చేసి ఎవరూ ప్రచురించవద్దు` అని ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ. ప్రస్తుతం రామ్ చరణ్ హీరో గా గేమ్ ఛేంజర్ నిర్మిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.