Pushpa movie collections | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఊహించినట్లుగానే మొదటి రోజు నుంచే కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది. అయితే నాలుగు రోజుల తర్వాత పుష్ప దూకుడు తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు. కానీ 6 రోజుల్లోనే సినిమా 100 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు రూ.109 కోట్ల షేర్ వసూలు చేసింది పుష్ప. పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్నిచోట్ల వసూళ్లు కలిసొచ్చాయి. ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా హిందీ, తమిళంలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. హిందీలో రూ.23 కోట్ల గ్రాస్.. తమిళంలో రూ.16 కోట్లు.. కేరళలో రూ.12 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.189 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం.
నైజాం: 32.17 కోట్లు
సీడెడ్: 10.39 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.75 కోట్లు
ఈస్ట్: 3.85 కోట్లు
వెస్ట్: 3.20 కోట్లు
గుంటూరు: 4.16 కోట్లు
కృష్ణా: 3.38 కోట్లు
నెల్లూరు: 2.44 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 65.95 కోట్లు
తమిళనాడు: 7.10 కోట్లు
కర్ణాటక: 8.75 కోట్లు
హిందీ: 11.65 కోట్లు
ఓవర్సీస్: 10.45 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 2.02 కోట్లు
6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 109.20 కోట్లు షేర్ (190 కోట్ల గ్రాస్)
పుష్ప సినిమా సేఫ్ అవ్వడానికి మరో రూ.40 కోట్లు రావాలి. 145 కోట్ల బిజినెస్ చేసిన పుష్ప.. 150 కోట్లు షేర్ వసూలు చేస్తే కానీ సేఫ్ అనిపించుకోదు. ఇప్పటికైతే తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగిలిన చోట్ల మాత్రం పుష్ప మంచి వసూళ్లే తీసుకొస్తుంది. అక్కడ హిట్ అనిపించుకున్న పుష్ప.. తెలుగులో హిట్ కొట్టడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్ప రెండో భాగంలో అదే మేజర్ హైలైట్.. ఆమె పాత్ర చనిపోతుందట..
పుష్పలో ఐటెం సాంగ్కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో హైయ్యస్ట్ ఫస్ట్ డే షేర్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?