Hema | తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను నవ్విస్తూ, భావోద్వేగాలకు గురిచేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఆమె తల్లి కోళ్ల లక్ష్మి (80) కన్నుమూశారు. సమాచారం ప్రకారం, గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు పలు అనారోగ్య సమస్యలు భాదపడుతున్న లక్ష్మి సోమవారం రాత్రి (నవంబర్ 17) ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త తెలిసిన హేమ వెంటనే తన స్వగ్రామం రాజోలు చేరుకున్నారు.
హేమ తల్లి పార్థీవ దేహాన్ని చూసి ఆమె బోరున విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున సంతాపం తెలియజేస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టై బయటకు వచ్చిన సమయంలో కూడా హేమ మాట్లాడుతూ,నేను జైలుకెళ్లడం చూసి మా అమ్మ తట్టుకోలేకపోయింది… అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది” అని చెప్పిన విషయం మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.
లక్ష్మి అంత్యక్రియలు నేడు రాజోలులో ఆమె కుమారుడు కోళ్ల శ్రీనివాస్ వద్ద నిర్వహించారు. తల్లి మరణంతో తీవ్ర వేదనలో ఉన్న హేమ తన తల్లితో దిగిన పలు పాత ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. హేమ కుటుంబానికి సెలబ్రిటీలు, ఫ్యాన్స్ తరఫున అనేకమంది సంతాపం తెలియజేస్తున్నారు.
అప్పుడెప్పుడో వచ్చిన క్షణ క్షణం నుంచి మొన్నటి దాకా సినిమాలు చేస్తూనే ఉందీ హేమ. దాదాపు 250కు పైగా సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా నటించిన హేమ కాంట్రవర్సీస్‌తో వార్తలలో నిలుస్తుంది. మా ఎలక్షన్స్ సమయంలో హాట్ హాట్ కామెంట్స్ చేసిన హేమ గతేడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పాల్గొందని అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. ఆ సమయంలో ఆమెని అరెస్ట్ చేసి విడుదల చేశారు. కెరీర్ పీక్ లో ఉండగానే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది హేమ.