Actress Hema Malini | డెబ్బై, ఎనభై దశకాల్లో సీనియర్ నటి హేమమాలిని బాలీవుడ్లో ఒక సంచలనం. ఆమె సినిమా వస్తుందంటే అప్పట్లో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్లలో హీరోల పక్కన హేమా మాలిని కటౌట్లు పెట్టి రచ్చ చేసేవారు. ఒక్క బాలీవుడ్లోనే వందకు పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించి అప్పట్లో సంచలనం సష్టించింది. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, నాట్యకళాకారిణిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం హేమమాలిని రాజకీయ నాయకురాలిగా రాణిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వూలో హేమమాలిని చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
హేమమాలిని ఓ సినీ దర్శకుడి మాటల వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఓ సినిమా సెట్లో చోటు చేసుకున్న ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తెలిపింది. తనపై రొమాంటిక్ యాంగిల్లో సీన్లు షూట్ చేయాలి ఆ దర్శకుడు అనుకున్నట్టున్నాడని, అయితే సాధారణంగా తను చీర కట్టినప్పుడు పైన పిన్ను పెట్టుకునే అలవాటు ఉందని చెప్పింది. అయితే ఆ సీన్ చేసేప్పుడు పైటకు పిన్ను పెట్టవద్దు అని ఆ దర్శకుడు అన్నాడు.కాని పిన్ను తీసేస్తే చీర జారిపోతుంది అని ఆ దర్శకుడితో అన్నట్లు హేమమాలిని చెప్పింది. దానికి ఆయన నాకు కావాల్సింది అదే అన్నాడని, దాంతో ఆయన మాటలకు తను కంగారుపడ్డాను అంటూ హేమా మాలిని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం హేమమాలిని రాజకీయ వేత్తగా రాణిస్తుంది. ఇక తెలుగులో హేమమాలిని గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్యకు తల్లిగా నటించింది. అంతకు ముందు కెరీర్ బిగెనింగ్లో సీనియర్ ఎన్టీఆర్తో కలిసి పాండవ వనవాసం సినిమాలో నటించింది.