e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021
Home News MAA Elections: శివ బాలాజీ చేయి కొరికిన హేమ‌.. ఏం జ‌రిగిందో ఎల‌క్ష‌న్ త‌ర్వాత చెప్తానంటూ కామెంట్

MAA Elections: శివ బాలాజీ చేయి కొరికిన హేమ‌.. ఏం జ‌రిగిందో ఎల‌క్ష‌న్ త‌ర్వాత చెప్తానంటూ కామెంట్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎంత వాడివేడిగా జ‌రుగుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. రాజకీయ ఎన్నికల సమయంలో గొడవలు జరిగినట్లు గానే.. మా ఎన్నికల పోలింగ్ సమయంలోనూ.. ఫైట్లు జరుగుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా రచ్చ జరుగుతోంది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని , బ‌య‌టి వాళ్లు ఓటు వేసేందుకు వ‌స్తున్నార‌ని పర‌స్ప‌రం ఫిర్యాదు చేసుకున్నారు.

అయితే ఇదే విష‌యంలో విష్ణు ప్యానెల్‌కు చెందిన శివ బాలాజీ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన హేమ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే లోప‌ల జ‌రిగిన గొడ‌వ విష‌యంపై స్పందించిన న‌రేష్‌.. శివ బాలాజీ చేయి హేమ కొరికింద‌ని అన్నాడు. ఆ త‌ర్వాత స్పందించిన శివ బాలాజీ తోపు లాట‌లో నేను రాడ్స్ ప‌ట్టుకున్నాను. ఆమె ఎందుకు చేయి కొరికిందో నాకు తెలియ‌దు, వీడియోలు ఉన్నాయి చూసుకోండ‌ని అన్నారు.

- Advertisement -

అయితే హేమ చేయి కొరికిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె స్పందించింది. లోప‌ల చాలా గొడ‌వ‌గా ఉంది. శివ బాలాజీ ఏం చేయకుండానే కొరుకుతానా, ఎన్నిక‌ల త‌ర్వాత వీటి గురించి మాట్లాడ‌తాను అని హేమ చెప్పుకొచ్చింది. అయితే పోలింగ్‌ కేంద్రం వద్ద జరిగిన గొడవపై స్పందించిన న‌రేష్‌.. ‘పెద్ద గొడవలేవి జరగలేదు. ఎవరో ఒకరు ప్రకాశ్‌ రాజ్‌ బ్యాడ్జ్‌ వేసుకొని రిగ్గింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తే.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను, ప్రకాశ్‌ రాజ్‌ కౌగిలించుకున్నాం. ‘నో ఫైటింగ్‌.. ఓన్లీ ఓటింగ్‌’అని చెప్పుకున్నాం. అని అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement