హెబ్బా పటేల్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘గీతా’. విశ్వ దర్శకత్వం వహించారు. ఆర్.రాచయ్య నిర్మాత. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ఆడియోను బుధవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ గీతా అనే అమ్మాయి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, వాటి నుంచి ఆమె ఎలా బయటపడిందన్నది ఆసక్తిని పంచుతుంది. కథలోని కొత్తదనం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని చెప్పారు. ఓ విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని హెబ్బాపటేల్ పేర్కొంది.