తమిళ హీరో విశాల్ డూప్స్ లేకుండానే రిస్కీ స్టంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన పలుమార్లు గాయాల బారిన పడ్డాడు. రీసెంట్గా ‘నాట్ ఏ కామన్ మేన్’ అనే చిత్ర షూటింగ్లో పాల్గొనగా, ఆ షూటింగ్లో జరిగిన ప్రమాదం వలన విశాల్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. విశాల్ ఫైట్ సీన్ చేస్తుండగా బలంగా గోడను ఢీకొని కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విశాల్.. వెన్నుపూసకు భారీగా దెబ్బ తగిలింది.
విశాల్ గాయపడిన వెంటనే చిత్ర బృందం ఆసుపత్రికి తరలించారు. వెన్నుకి తీవ్రమైన గాయం కావడం వలన విశాల్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. కాగా, విశాల్ ఫైటింగ్ సీన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘నాట్ ఏ కామన్ మేన్’ చిత్రం విశాల్‌కి 31వ సినిమా కాగా, ఈ చిత్రానికి పి. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో విశాల్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఇటీవల ఎనమి అనే మల్టీ స్టారర్ చిత్ర షూటింగ్ కూడా విశాల్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.