Game Changer | టాలీవుడ్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game changer) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఆర్సీ 15 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్ట్ చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. గేమ్ ఛేంజర్‌లో జెర్సీ ఫేం విశ్వంత్ ఈ చిత్రంతో రాంచరణ్ సోదరుడిగా కనిపించబోతున్నాడట.
అంతేకాదు ఇటీవలే రాంచరణ్, విశ్వంత్ (Viswant Duddumpudi) మధ్య వచ్చే సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్. 30 వెడ్స్ 21 సిరీస్ ఫేం అనన్య శర్మ ఇందులో విశ్వంత్ లవర్‌గా మెరువనున్నట్టు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. మేకర్స్ దీనిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే స్టంట్ మాస్టర్ అన్బరివ్ నేతృత్వంలో మైక్రోబాట్ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్ షూట్‌ను పూర్తి చేసినట్టు శంకర్ తెలియజేశాడు. అనంతరం 3 రోజుల విరామం తర్వాత హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గేమ్ ఛేంజర్ షూటింగ్ మళ్లీ షురూ అయింది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య, అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
గేమ్ ఛేంజర్ సెట్స్‌లో..
HAPPY INDEPENDENCE DAY from the sets of #GameChanger pic.twitter.com/w5t1nzmHWj
— Shankar Shanmugham (@shankarshanmugh) August 15, 2023
Shankar Sir Bday Celebrations from #GameChanger Sets 🎉😊🫶@AlwaysRamCharan anna is Shining 🤩🔥pic.twitter.com/mdKwebncFk
— MEGA FAMILY FANS (@MegaStarKTweets) August 16, 2023