Hasini Sudheer | ‘పురుషోత్తముడు’ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగంలోకి అరంగేట్రం చేస్తున్నది హాసినీ సుధీర్. రాజ్‌తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హాసినీ సుధీర్ మాట్లాడుతూ ‘మాది మహారాష్ట్ర. హీరోయిన్ కావాలన్నది నా చిన్ననాటి కల. ముంబైలో మోడలింగ్ చేశాను.
‘పురుషోత్తముడు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు అమ్ములు. అంతా అమ్ము అని పిలుస్తారు. తెలుగు సినిమాలు చూస్తూ పెరగడం వల్ల తెలుగు త్వరగా నేర్చుకోగలిగాను. తొలి సినిమాలోనే ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ వంటి సీనియర్స్‌తో కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నా. ఈ సినిమా తెలుగులో బ్రేక్నిస్తుందన్న నమ్మకం ఉంది. భవిష్యత్తులో లవ్‌స్టోరీస్‌తో పాటు యాక్షన్ మూవీస్ చేయాలనుకుంటున్నా’ అని చెప్పింది.