‘కోర్ట్’ జోడీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన వినోదాత్మక యువతరం సినిమా ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. మార్చి 26న శ్రీరామనవమి కానుకగా విడుదల కానున్నది. ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ‘ఈ కథ వినగానే రోషన్, శ్రీదేవి అయితే పర్ఫెక్ట్ అనిపించింది.
ఈ సినిమా తర్వాత ఈ జంటను వెతుక్కుంటూ కథలు వస్తాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ మనసుల్ని కదిలిస్తుంది. నా కుమార్తెలు కావ్య, శ్రావ్య ఈ సినిమాతో నిర్మాతలుగా మారారు. తప్పక విజయం సాధిస్తారని నమ్మకంతో ఉన్నా’ అని అశాభావం వెలిబుచ్చారు. ఇది ఎమోషనల్ మూవీ అనీ, సాంకేతికంగా అన్ని విభాగాలూ ప్రాణం పెట్టి పనిచేశాయని, క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుందని దర్శకుడు సతీష్ జవ్వాజి చెప్పారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు హర్ష్ రోషన్, శ్రీదేవి ఆనందం వెలిబుచ్చారు.