Ustaad Bhagat Singh | పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూ వున్నాయి. దాంతో చిత్ర దర్శకుడు హరీశ్‌శంకర్ స్పందించక తప్పలేదు. ఓ నెటిజన్ అత్యుత్సాహంతో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ గురించి ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పటివరకూ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ 20 రోజులు మాత్రమే జరిగిందని, జనవరి నుంచి దర్శకుడు హరీశ్‌శంకర్ రవితేజ సినిమా పనుల్లో బిజీ కానున్నారనేది ఆ పోస్ట్ సారాంశం. దీనిపై హరీశ్ తనదైన శైలిలో స్పందించారు.
‘రెండు అప్డేట్లూ తప్పే.. ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది’ అంటూ హరీశ్ ఎక్స్(ట్విటర్)ద్వారా స్పందించారు. ఇక ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ‘గబ్బర్‌సింగ్’ని మించే పవర్ఫుల్ పోలీస్‌గా ఇందులో పవన్‌కల్యాణ్ కనిపించనున్నాడని చిత్ర యూనిట్ చెబుతున్నారు.
ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల రీత్యా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సన్నాహాలు చేస్తున్నారు.