Harish Shankar | టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. షాక్, మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించాడు. అయితే ఈ దర్శకుడు తాజాగా చేసిన ఒక పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే. హైదరాబాద్లో రోడ్డుపై సడన్గా ఒక కారు ఆగిపోయింది. అయితే ఇదే క్రమంలో అటుగా వెళుతున్న హరీష్ శంకర్, టాలీవుడ్ నిర్మాత రవి శంకర్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా నిలిచిపోయిన వాహనానికి సాయం చేశారు. రోడ్డు మధ్యలో ఉన్న ఆ వాహనాన్ని త్రోసుకుంటూ రోడ్డు పక్కన పార్కింగ్ చేశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Director #HarishShankar @harish2you sir and @MythriOfficial Ravi gaaru are helping the vehicle which is stopped on road 👏👏👏
Kudos to you sir 🙏🙏 @harish2you it’s a great beginning of my day sir after watching this one 👏👏👏 pic.twitter.com/P55eO5x9uU— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 14, 2024