HariHara veeramallu | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. చిత్ర రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో సినిమాలోని నాలగవ సింగల్ ని విడుదల చేశారు. . ‘తార తార నా కళ్లు..’ అంటూ సాగే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ముఖ్యంగా నిధి తన అందాలతో అదరగొట్టేసింది. శ్రీ హర్ష లిరిక్స్ అందించగా లిప్సిక, ఆదిత్య పాడారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు.ఇక చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, పవర్ ఫుల్ ‘అసుర హననం’ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మూవీలో అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, నాజర్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. జ్యోతికృష్ణ తెరకెక్కించిన ఈ బిగ్గీని ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావలసి ఉన్నా కూడా పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటి వరకు మూవీ పదిసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకి జూన్ 12న విడుదల కానుంది. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ భారీ ఎత్తునే ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబైలోను ఈవెంట్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘డాకు మహారాజ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాబి డియోల్, ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఆయన దొరలను దోచి పేదలకు న్యాయం చేసే రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తుంది.