హరి ఎడ్లపల్లి, ప్రియా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘హరిగాని హరి కథ’. సర్వేష్ వైవీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సురభి హరీందర్ రావు నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. వినూత్న ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, వినోదంతో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో సాగుతుందని దర్శకుడు తెలిపారు.
మురళీగౌడ్, హర్షవర్ధన్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రష్టి వర్మ, శివకుమార్‌తో పాటు విదేశి నటి అలేగ్జాండ్రా వేల్హన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ రెడ్డి, సంగీతం: మాధవ ఆడి.