పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ నాయికగా కనిపించనుంది. బాలీవుడ్ తారలు బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తుండగా…అతని సోదరి రోషనార పాత్రను నర్గీస్ ఫక్రి పోషిస్తున్నది. మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చింది.
ఈ చిత్ర టీజర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. లాక్డౌన్ వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండి యా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.