Hari Hara Veera Mallu | అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దారుణమైన గ్రాఫిక్స్.. పాత కథతో వచ్చి మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.100 నష్టాలను చవిచూసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు రూ. 200 కోట్లు కాగా.. దీనికి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు రూ.106 కోట్లు. దీంతో నిర్మాతలకు రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ నష్టాల నేపథ్యంలోనే, సినిమా హక్కుల అమ్మకాలలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.