Hari Hara Veera Mallu Overseas | పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈరోజు రాత్రి నుంచే ప్రీమియర్స్ మొదలుకానున్నాయి.
అయితే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ విషయంలో ఇటీవల చిన్న సమస్య ఏర్పడింది. అనుకోని కారణాల వలన ఈ సినిమా డిజిటల్ ప్రింట్ అందలేదని ఓవర్సీస్కి చెందిన నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ మూవీ చూద్దామనుకున్న అభిమానులు ఆందోళనలో పడ్డారు. అయితే తాజాగా ఈ సమస్య క్లీయర్ అయినట్లు సదరు సంస్థ పోస్ట్ పెట్టింది. తమకు ఓవర్సీస్కి చెందిన ప్రింట్లు వచ్చేశాయని పేర్కొంది. అలాగే ఈ మూవీ దాదాపు 2 గంటల 45 నిమిషాలు రన్‌టైంతో రాబోతున్నట్లు ప్రకటించింది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.