Payal Rajput | ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput). ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మళ్లీ చాలా కాలం తర్వాత ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన మంగళవారం సినిమాతో సూపర్ బ్రేక్ అందుకుంది. అయితే నిర్మాతల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఓ వార్తను షేర్ చేసి.. అందరినీ షాక్‌కు గురిచేసింది పాయల్ రాజ్‌పుత్.
ఇంతకీ విషమేంటనుకుంటున్నారా..? పాయల్ రాజ్‌పుత్ రక్షణ (Rakshana) టైటిల్‌తో నటించిన సినిమానే ఈ వేధింపులకు కారణం. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది పాయల్ రాజ్‌పుత్. 2019-2020లో రక్షణ సినిమా షూట్ చేశారు. ఈ మూవీ ఒరిజినల్ టైటిల్ 5Ws. విడుదల ఆలస్యమైంది. ఇప్పుడు వాళ్లు (నిర్మాతలు) నా పెండింగ్ బకాయిలను చెల్లించకుండానే ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తూ.. లాభాలు పొందాలని చూస్తున్నారు.
ముందుగా తీసుకున్న కమిట్మెంట్స్ కారణంగా నేను అందుబాటులో లేనని నా టీం నిర్మాతలకు తెలియజేసింది. కానీ వాళ్లు తెలుగు సినీ పరిశ్రమ నుంచి నన్ను నిషేధించాలని చూస్తున్నారు. నా రెమ్యునరేషన్‌ను సెటిల్ చేయకుండానే.. నా అనుమతి లేకుండా సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీనిపై మేము న్యాయపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నామని పోస్ట్ చేసింది. పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తమిళంలో గోల్మాల్, ఏంజెల్ తెలుగులో కిరాతక చిత్రాల్లో నటిస్తోంది.