ధమ్ బిర్యాని లాంటి సినిమా
చెప్పాలని ఉంది, అలాంటి సిత్రాలు, శాకుంతలం చిత్రాల ద్వారా ప్రతిభావంతుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు యువ హీరో యష్ పూరి. ఆయన తాజా చిత్రం ‘హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదలకానుంది.
చెప్పాలని ఉంది, అలాంటి సిత్రాలు, శాకుంతలం చిత్రాల ద్వారా ప్రతిభావంతుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు యువ హీరో యష్ పూరి. ఆయన తాజా చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా యష్ పూరి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘మన పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. నేటితరం యువకుడు శాపం బారిన పడితే అతని పరిస్థితి ఏమిటనే అంశాన్ని వినోదాత్మకంగా చూపించాం. సినిమాలో నా పాత్ర పేరు హర్ష్. శాపాల వల్ల తను ఇబ్బందిపడుతూ ప్రేక్షకుల్ని నవ్విస్తాడు. చివరి 15 నిమిషాలు మాత్రం భావోద్వేగభరితంగా అనిపిస్తాయి’ అన్నారు. ఈ సినిమాలో ఎలాంటి అడల్డ్ కంటెంట్ ఉండదని, ఫ్యామిలీతో కలిసి హాయిగా సినిమా చూడొచ్చని చెప్పారు యష్ పూరి. ఇక ప్రేమ అనే అంశాన్ని కూడా కవితాత్మక, ఆధ్యాత్మిక అంశాల కలబోతగా చూపించామని అన్నారు. ‘ప్రేమకథ చాలా కొత్తగా అనిపిస్తుంది. హీరో శాపగ్రస్తుడు కాబట్టి అతని ప్రేమ వ్యక్తీకరణ పొయెటిక్ ఫీల్‌తో ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, డ్రామా..ఇలా అన్ని అంశాలు కలిగిన ధమ్ బిర్యాని లాంటి సినిమా ఇది’ అని యష్ పూరి తెలిపారు. కమర్షియల్ హీరోగా రాణించాలన్నదే తన లక్ష్యమని, కెరీర్లో కాస్త స్థిరపడిన తర్వాత పక్కా మాస్ సినిమాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

