Meenakshi Chowdary | తెలుగులో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది హర్యాన్వీ భామ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్ పోషిస్తున్న ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సుమతి పాత్రలో నటిస్తోంది. ఈ భామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
చీరకట్టులో గుమ్మం ముందు కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న మీనాక్షి చౌదరి లుక్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.మీనాక్షి చౌదరి ప్రస్తుతం విశ్వక్సేన్తో కలిసి VS 10లో నటిస్తోంది. దీంతోపాటు వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమా మట్కాలో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు విజయ్ నటిస్తోన్న GOAT కూడా ఈ భామ ఖాతాలో ఉంది.
మీనాక్షి చౌదరి ‘లక్కీ భాస్కర్’ లుక్..
Team #LuckyBaskhar wishes a very Happy Birthday to their leading lady Sumathi. #MeenakshiChaudhary from #DulquerSalmaan‘s Next#HBDMeenakshi @Meenakshiioffl pic.twitter.com/7FLou9hyDc
— Suresh PRO (@SureshPRO_) March 5, 2024