స్వయంకృషికి చిరునామా…మంచితనానికి మారు పేరు.. ఓర్పుకి నిలువెత్తు నిదర్శనం.. మెగాస్టార్ చిరంజీవి. జీవితంలో ఎత్తు పల్లాలని చూసిన చిరంజీవి ఈ రోజు ప్రజల గుండెల్లో దేవుడిగా మారాడు. నటుడిగానే కాదు సామాజిక సేవకుడిగా కూడా అందరి మనసులు గెలుచుకున్నాడు చిరు. నేడు 66వ వసంతంలోకి అడుగుపెడుతున్న చిరుకి సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కొణిదెల శివశంకర ప్రసాద్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఉన్నత స్థానంలో నిలిచిన చిరు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ రోజు చిరు బర్త్ డే తెలుగు రాష్ట్రాలలోనే కాక విదేశాలలోను పండుగలా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో చిరుకి సంబంధించి పలు హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ లో నిలిచాయి.
చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన తదుపరి సినిమా దర్శకులు క్రేజీ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పటికే ఆచార్య నుంచి అరిరిపోయే గిఫ్ట్ రెడీ అవుతుంది అలాగే లూసిఫర్ రీమేక్ మూవీ టైటిల్ గాడ్ ఫాదర్ అంటూ ప్రకటించారు మేకర్స్. ఇక కొద్ది సేపట్లో మెహర్ రమేష్ మూవీ టైటిల్ రివీల్ కానుంది. సాయంత్రం బాబీ సినిమాకు సంబంధించి అప్డేట్ రానుంది. ఒకవైపు ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్ హంగామా, మరో వైపు చిరు మూవీలకి సంబంధించిన అప్డేట్స్తో సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే.