Brahmanandam | ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా సరే చాలా సులభంగా ప్రదర్శిస్తూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలంటే బ్రహ్మానందం (Brahmanandam) తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జంధ్యాల డైరెక్షన్లో తెరకెక్కిన అహ నా పెళ్లంట సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం.. లెజెండరీ కమెడియన్‌గా తెలుగు ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
కోట్లాదిమంది అభిమానులను సంపాదించిన ఈ స్టార్ కమెడియన్ నేడు 67వ పడిలోకి అడుగుపెట్టారు. ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు బ్రహ్మీ అభిమానుల్లో ఉండరు. అలాంటి అభిమానుల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). తనతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన బ్రహ్మానందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు చిరు. బ్రహ్మానందం నివాసానికి వెళ్లిన చిరు ఆయనకు శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు.
నాకు తెలిసిన బ్రహ్మానందం ఒకప్పుడు అత్తిలిలో ఒక లెక్చరర్. నేడు ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకెక్కిన గొప్ప హాస్యనటుడు. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది.. సుదీర్ఘమైన సందేశాన్ని పోస్ట్ చేస్తూ బ్రహ్మానందానికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
బ్రహ్మానందం ఫ్యామిలీతో చిరంజీవి..
Happy Birthday
Dear Brahmanandam 💐 pic.twitter.com/sp0r9wUJPQ— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2023