Abhishek Sharma | పుట్టిన రోజున గుంజీలు.. టీమిండియా స్టార్‌కు ఎందుకీ శిక్ష..!
Abhishek Sharma : ఎవరైనా సరే తమ పుట్టిన రోజున ప్రత్యేకంగా ఏదైనా చేస్తారు. స్నేహితులతో, కుటుంబసభ్యులతో పార్టీ మూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే.. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మాత్రం అందుకు విభిన్నం అని చెప్పాలి.
Abhishek Sharma : ఎవరైనా సరే తమ పుట్టిన రోజున ప్రత్యేకంగా ఏదైనా చేస్తారు. స్నేహితులతో, కుటుంబసభ్యులతో పార్టీ మూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే.. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) మాత్రం అందుకు విభిన్నం అని చెప్పాలి. ఎందుకంటే.. అతడు తన బర్త్ డే నాడు వెరైటీగా గుంజీలు తీశాడు. అలాఅనీ ఈ డాషింగ్ బ్యాటర్‌కు ఎవరు శిక్ష విధించలేదు. కోచ్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) అతడితో సరదాగా సిట్ అప్స్ చేయించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
విధ్వంసక ఆటతో భారత టీ20 జట్టులో స్థిరపడిన ఓపెనర్ అభిషేక్ శర్మ తన పుట్టిన రోజునాడు గుంజీలు తీశాడు. సెప్టెంబర్ 4వ తేదీన 26వ వసంతంలో అడుగుపెట్టిన అభిని.. అతడి కోచ్ యువరాజ్ సింగ్ సరదాగా సిట్ అప్స్ చేయమన్నాడు. గురువు ఆదేశించడం.. శిష్యుడు కాదనడమా అన్నట్టు టీమిండియా ఓపెనర్ ధనాధన్ గుంజీలు తీసి గురుభక్తిని చాటుకున్నాడు.
‘సర్ అభిషేక్. ఈరోజు నీ జన్మదినం. ఎంతో అద్భుతమైన రోజు. నంబర్ 1 బ్యాటర్‌గా ఎదిగిన నిన్ను నువ్వు ప్రేమించుకో. అలానే.. నీ చుట్టు ఉన్నవాళ్లను జాగ్రత్తగా చూసుకో. ఎల్లప్పుడూ వైఫల్యాల నుంచి నేర్చుకో. ప్రతిసారి మరింత కష్టపడు. ఎప్పటిలానే మరో ఏడాది నీవు మరిన్ని పరుగులు, సెంచరీలు సాధించాలని కోరుకుంటున్నా. ఎల్లవేళలా నీకు ప్రేమతో’ అని యువరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పంచుకున్నాడు.
అయితే.. ‘బర్త్ డే బాయ్ అభిషేక్‌తో గుంజీలు ఎందుకు?’ అనే సందేహం వస్తోందా. అందుకు ఓ కారణముంది. ఈ ఓపెనర్ సరైన షాట్లు ఆడకపోవడంతో కోపం వచ్చిన యువరాజ్ సిట్ అప్స్ చేయించాడు. ఏదిఏమైనా బర్త్ బాయ్ సిట్ అప్స్ చేయడం ఏంటీ.. ఏదైనా పార్టీలో స్టెప్పులు వేయాలిగానీ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో.. కోచ్ అంటే యూవీనే.. బ్యాటర్లను సానబెడుతాడు.. అప్పుడప్పుడు ఇలా సరదాగా పనులు చేయిస్తాడు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టీ20లో సంచలనమైన అభిషేక్.. త్వరలో జపాన్ వేదికగా జరుగనున్న ఆసియా క్రీడలకు సన్నద్ధమవుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

