Hanuman Movie Teaser | ‘అ!’, ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి వినూత్న సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ హీరో ఫాంటసీ నేపథ్యంలో ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నాడు. తేజా సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే షూటింగ్ స్టార్ట్ అయి నెలలు గడుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ గాని, టీజర్ గాని ఇప్పటివరకు రాలేదు. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
హనుమాన్ టీజర్‌కు డేట్‌ను నవంబర్ 7న ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఈ సినిమా టీజర్ దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. కానీ ఆదిపురుష్ టీజర్ రావడంతో పోస్ట్ పోన్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిలింగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో తేజకు జోడీగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది. డాక్టర్ ఫేం వినయ్‌రాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
#HanuManTeaser update on 7th Nov 🙂@Primeshowtweets
— Prasanth Varma (@PrasanthVarma) November 4, 2022
Read Also:
Urvasivo Rakshasivo | ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ రివ్యూ
NS24 | నాగశౌర్య సినిమాలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!
టెలివిజన్‌లో ‘ఆచార్య’ షాకింగ్ టీఆర్పీ.. ఆ సీనియర్ హీరోల దగ్గరకు కూడా రాలేకపోయిన చిరు..!