Hanuman Movie | టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రానుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక విడుదలకు ఇంకా 9 రోజులో ఉండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా వచ్చిన టీజర్‌తో పాటు ట్రైలర్లు హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి శ్రీరామదూత స్తోత్రం చిత్రబృందం విడుదల చేసింది. రం రం రం రక్తవర్ణం అంటూ సాగే ఈ స్తోత్రం ఎంతో గంభీరంగా ఉండగా.. వింటుంటే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక ఈ స్తోత్రాన్ని సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హర్షవర్దన్ చావలి కలిసి పాడగా.. గౌరహరి దీనికి సంగీతం అందించాడు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్యరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.