తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హను-మాన్’. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కానందున సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
‘హనుమాన్ టీజర్‌కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభించింది. దాంతో మాపై మరింత బాధ్యత పెరిగినట్లుగా భావించాం. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయి. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అత్యుత్తమ వీఎఫ్ఎక్స్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో సినిమా విడుదలకు మరికొంత సమయం తీసుకుంటున్నాం. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది.
అంజనాద్రి అనే ఊహాత్మక ప్రపంచంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్యరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్‌విల్లే, నిర్మాణ సంస్థ: ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్.