Hanuman Movie | టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించే సినిమాలు ఎంత క్రియేటివ్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలు వేటికవి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ మూడు చిత్రాలు విభిన్నమైన జానర్స్‌లో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు హనుమాన్ (Hanuman) అంటూ తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ(Prashanth Varma). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు తెలుస్తుండగా, ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్నాడు. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. యూనివర్సల్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే హై టెక్నికల్ వాల్యూస్‌తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విడుదలకు ఇంకా రెండు నెలలు ఉండటంతో.. ఇప్పటినుంచే ప్రమోషన్స్ షూరు చేయనుంది. ఇందులో భాగంగా దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్లో నోటితో తేజ సజ్జా టపాసును కాల్చుతున్నట్లుగా ఉంది. అలాగే తేజ భుజంపై కోతి కూర్చుని ఉంది. ఇక దీనితో పాటు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘సూపర్ హీరో హనుమాన్'(Super Hero Hanuman) అనే సాంగ్ ను నవంబర్ 14న సాయంత్రం 5:04కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Happy Diwali💥🤗
Get ready for an electrifying celebration with the #SuperHeroHanuMan song launch on NOV 14th at 5:04PM❤️🔥
🌟ing @tejasajja123
IN CINEMAS from JAN 12th 2024💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @anudeepdev @Primeshowtweets @Chaitanyaniran… pic.twitter.com/X85JnYODS4
— Prasanth Varma (@PrasanthVarma) November 12, 2023