Hanuman Movie | తీసినోడు నా కొడుకు – ‘హనుమాన్’ సినిమాపై ప్రశాంత్ వర్మ తండ్రి రివ్యూ
Hanuman Movie | టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ విన్న హనుమాన్ పేరే వినిపిస్తుంది. జాంబి రెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మూవీ బాగుందని, వీఎఫ్ఎక్స్, విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని చెబుతున్నారు.
Hanuman Movie | టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ విన్న హనుమాన్ పేరే వినిపిస్తుంది. జాంబి రెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు కూడా మూవీ బాగుందని, వీఎఫ్ఎక్స్, విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని చెబుతున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా చూసిన ప్రశాంత్ వర్మ తండ్రి మూవీపై రివ్యూ ఇచ్చాడు. సాధారణ ప్రేక్షకుడిలా ఓ థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చాడు ప్రశాంత్ వర్మ తండ్రి. అయితే అతనేవరో తెలియని కొంతమంది రిపోర్టర్లు కెమెరాలు పెట్టి సినిమా ఎలా ఉందని అడుగుతారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. నేను ప్రశాంత్ వర్మ తండ్రిని. హనుమాన్ తీసినోడు నా కొడుకు.. ప్రశాంత్ వర్మ తండ్రిని అయినందుకు గొప్పగా భావిస్తున్నాను అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. హనుమాన్ అద్భుతంగా ఉందని, ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని అందరూ బాగా నటించారని చెప్పుకొచ్చారు. ఇక ఇది చూసిన నెటిజన్లు కొడుకు విజయాన్ని చూసి గర్వ పడుతున్న తండ్రి ఆనందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Teesinodu naa koduku.#Hanuman pic.twitter.com/T3fGxbqQmR
— Satya 🥛 (@YoursSatya) January 13, 2024
ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో. తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించాడు. కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాను జనాలు క్యూ కడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

