బాలీవుడ్లో సంచలన విజయం సాధించడమే కాకుండా రికార్డు స్థాయి వసూళ్లను అందుకుంటున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రం తెలుగులో రానుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సమర్పణలో ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని ఈ నెల 18న తెలుగులో విడుదల చేస్తున్నది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది ‘హనుమాన్ అంశ్’ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాలో శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. గత నెల 7వ తేదీన బాలీవుడ్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 150కోట్ల వసూళ్లను సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో భారీ అంచనాలేర్పడ్డాయి.