Hansika | దేశ ముదురు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ హన్సిక. ఈ అమ్మడు తెలుగులో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించింది. హిందీతో పాటు ఇతర భాషలలోను పలు సినిమాలు చేసింది. మంచి టాలెంట్ ఉన్న హన్సికకి ఇటీవల సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే 2022 డిసెంబర్లో హన్సిక తన బాయ్ ఫ్రెండ్ సోహైల్‌ని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. హన్సిక స్నేహితురాలితో సొహైల్ కు గతంలో వివాహం అయిన, ఆమెకి విడాకులు ఇచ్చి హన్సికని పెళ్లి చేసుకున్నాడు.
కొద్ది రోజులుగా హన్సిక, సొహైల్ కూడా విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా వీరు విడివిడిగా ఉంటున్నారని నెట్టింట వార్తలు వస్తున్నాయి. సోహల్‌ది పెద్ద కుటుంబం కాగా, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, అందుకే నటి ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంటోందని టాక్ నడుస్తుంది. మరోవైపు హన్సిక తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు అన్ని డిలీట్ చేయడంతో ఈ ప్రచారం నిజమేనని కొందరు భావిస్తున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే హన్సిక లేదా సొహైల్ లేకుంటే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు స్పందిస్తే కాని క్లారిటీ రాదు.
అయితే హన్సిక మోత్వానీ రీసెంట్గా 34వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఎమోషనల్ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇందులో ఆమె జీవితంలో వచ్చిన మార్పులు, నేర్చుకున్న పాఠాల గురించి చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. 2025 సంవత్సరం నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాకు తెలియకుండానే నాలో ఇంత బలం ఉందా అనేలా చేసింది. నాకు మీరు అందించిన శుభాకాంక్షలతో నా మనస్సు ఉప్పొంగిపోతుంది. చిన్న విషయాలు కూడా ఒక్కోసారి చాలా ఆనందాన్ని ఇస్తాయి. మీ అందరికి ధన్యవాదాలు అంటూ హన్సిక రాసుకొచ్చింది. ఆమె పోస్ట్‌తో మరోసారి హన్సిక విడాకుల అంశం నెట్టింట హాట్ టాపిక్ అయింది.