సింగిల్ క్యారెక్టర్ సింగిల్ షాట్
అగ్ర కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘105 మినిట్స్'. రాజు దుస్సా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అగ్ర కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘105 మినిట్స్’. రాజు దుస్సా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బొమ్మక్ శివ నిర్మాత. గురువారం ట్రైలర్ రిలీజ్ అయింది. తన పాత్ర వేషధారణలోనే హన్సిక ట్రైలర్‌ను విడుదల చేయడం వినూత్నంగా తోచింది. హన్సిక మాట్లాడుతూ “ఒకే క్యారెక్టర్ని ఒకే షాట్లో చిత్రీకరించిన తొలి ప్రయోగాత్మక చిత్రమిది.
ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ 34 నిమిషాల షాట్‌ను సింగిల్ టేక్‌లో చేయడం నాకు కొత్త అనుభవాన్ని, అనుభూతిని పంచింది. 8 రోజుల రిహార్సల్స్ చేసిన తర్వాత షూటింగ్‌కి వెళ్లాం’ అని చెప్పింది. ప్రస్తుతానికి ఒక్క తెలుగు వెర్షన్లోనే మేకర్స్ చేయనున్నారు. తర్వాత వివిధ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచనతో ఉన్నారు. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిశోర్ బోయిదాపు, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాత: బొమ్మక్ శివ, దర్శకత్వం: రాజు దుస్సా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

