Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
Haiku Movie | టాలీవుడ్లో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హైకూ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్లో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. తాజాగా యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘హైకూ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ అరుళానంధు, మ్యాథ్యూ అరుళానంధు నిర్మించిన ఈ చిత్రంలో శ్రీదేవి, ఏగెన్, ఫెమినా జార్జ్, మైమ్ గోపి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. విభిన్నమైన భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
గర్ల్స్ కాలేజీలో చేరిన ఏకైక అబ్బాయి మనోహర్ (ఏగన్) అమ్మాయిల చేత ర్యాంగింగ్కు గురవుతుంటాడు. ఆ సమయంలో అదే కాలేజీకి చెందిన జాబిలి అలియాస్ కోడి (శ్రీదేవీ) పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. అయితే పెళ్లి వరకు వెళ్లిన వీరి బంధానికి కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడుతుంది. బ్రేకప్ తర్వాత కూడా ఆ జ్ఞాపకాలతోనే మనో జీవితం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో తన కంపెనీలో అప్రెంటీస్‌గా చేరిన నివేదా (ఫెమినా జార్జ్)కు మనో మేనేజర్‌గా ఉంటాడు. ఆ పరిచయం స్నేహంగా మారి, అప్పటికే లవ్ రిలేషన్షిప్ బ్రేకప్‌తో బాధపడుతున్న నివేదా, మనో ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే పాత జ్ఞాపకాలు, గత అనుభవాలు వీరి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు సృష్టించాయి? చివరకు మనో, జాబిలి, నివేదాల ప్రేమకథల ప్రయాణం ఎలాంటి ముగింపునకు చేరింది? అనేదే ఈ చిత్ర అసలు కథ.
నటీనటుల నటన:
ఈ సినిమాకు యువ నటీనటుల పెర్ఫార్మెన్సే ప్రధాన బలం. ‘కోర్టు’ ఫేమ్ శ్రీదేవి మరోసారి జాబిలి పాత్రలో తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. వయసుకు మించి పరిణతితో కూడిన భావోద్వేగాలను పండించి మెప్పించింది. ఇక ఫెమినా జార్జ్ సెకండాఫ్‌లో తన అద్భుతమైన నటనతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. యువ హీరో ఏగెన్ భగ్న ప్రేమికుడిగా, ఇద్దరు ప్రేమికుల మధ్య నలిగిపోయిన యువకుడిగా చక్కని హావభావాలు ప్రదర్శించి, పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
దర్శకుడు యువరాజ్ చిన్నస్వామి ఎంచుకున్న పాయింట్ డిఫరెంట్‌గా ఉంది. పాత జీవితపు జ్ఞాపకాలు, బ్రేకప్ బాధలు నేటి జెన్ జీ యువతపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశాన్ని చక్కగా తెరకెక్కించారు. టెక్నికల్ విషయానికి వస్తే.. సిద్దూ కుమార్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేశాయి. పియూష్ గురుస్వామి సినిమాటోగ్రఫి ప్రతి ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా, ఫీల్ గుడ్‌గా చూపించింది. ఎడిటింగ్ పనులు కథకు తగినట్లుగా సాగాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
యూత్ ని కనెక్ట్ చేసే కొత్త తరహా లవ్ కాన్సెప్ట్
శ్రీదేవి, ఫెమినా జార్జ్ మరియు ఏగెన్ నటన
నేపథ్య సంగీతం మరియు సినిమాటోగ్రఫి
ఎమోషనల్ సీన్స్
చివరిగా.. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినప్పటికీ, నేటి తరపు రిలేషన్షిప్స్, వాటి వెనుక ఉండే ఎమోషన్స్‌ను డైరెక్టర్ చూపించిన తీరు బాగుంది. యూత్ అండ్ లవ్ స్టోరీస్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి అనుభూతిని పంచుతుంది.
రేటింగ్: 3
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

