Gymkhana | మలయాళంలో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘అలప్పజ జింఖానా’ చిత్రం తెలుగులోకి రాబోతున్న విషయం తెలిసిందే. ‘జింఖానా’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ‘ప్రేమలు’ ఫేం నస్లెన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఖలీద్ రెహమాన్ స్వీయ దర్శకత్వంలో జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించారు. ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
కొందరు యువకులు బాక్సింగ్ క్లాస్ కోసం సెయిన్ చేయడంతో ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. బాక్సింగ్ అంటే పంచ్‌లు విసరడం మాత్రమే కాదని, ఇది క్రమశిక్షణ, విల్ పవర్‌తో కూడుకున్నదనే సందేశంతో ట్రైలర్ ముగిసింది. లుక్మాన్ అవరన్, గణపతి, బేబీ జీన్, సందీప్ ప్రదీప్, ఫ్రాంకో ఫ్రాన్సిస్ తదితరులు చిత్ర తారాగణం. ప్రేమలు తర్వాత నస్లేన్ సినిమా కావడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.