Gurthundha Seethakalam Movie Trailer | ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్. పాత్ర నచ్చితే క్యారెక్టర్ నిడివి ఎంత అని ఆలోచించకుండా నటించే అతికొద్ది మంది నటులలో ఈయన ఒకడు. ఇటీవలే ఈయన నెగెటీవ్ పాత్రలో నటించిన ‘గాడ్‌ఫాదర్’ రిలీజై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో విలన్‌గా సత్యదేవ్ అద్భుతమైన నటనను కనబరిచాడు. ఇక దీపావళికి రిలీజైన ‘రామ్‌సేతు’లోనూ కీలకపాత్రలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘గుర్తుందా శీతాకాలం’ ఒకటి.
నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాలతో రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. టీనేజ్ లవ్, కాలేజ్ లవ్, అడల్టేజ్ లవ్ ఇలా ప్రతీ ఏజ్‌లో ఒక అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు సత్యదేవ్. ఒక అమ్మాయితో బ్రేక్ అవగానే మరో అమ్మాయితో లవ్‌లో పడుతుంటాడు. మరి చివరికి హీరో పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటే ఎవరిని చేసుకుంటాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
ఈ సినిమా కన్నడలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా తెరకెక్కింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్‌కు జోడీగా తమన్నా, మేఘ ఆకాష్ నటించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుంచాయి.