GunturKaaram Movie Songs | సంక్రాంతిపై ముందుగు ఖర్చీఫ్ వేసుకున్న సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. అప్పుడెప్పుడో ఏడాదినర్ధం కిందట మొదలైన ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఆది నుంచి ఈ సినిమాకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. రెండు షెడ్యూల్స్ తర్వాత ఏకంగా కథనే మార్చారంటే ఇదెక్కడి విడ్డూరం అనిపించింది. ఆ తర్వాత మహేష్‌బాబు ఫ్యామిలీలో విషాదాలు, వెకేషన్లు ఇలా చూస్తుండగానే నెలలు నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఈ ఏడాది కలిసొచ్చి నిర్విరామంగా షూటింగ్ జరుతుందనగా మళ్లీ ప్రాజెక్ట్ నుంచి పలువురు తప్పుకోవడంతో సినిమా పరిస్థితేంటా అని అభిమానుల టెన్షన్ అంతా ఇంతా కాదు.
ఓ వైపు కాస్ట్ అండ్ క్రూలో ఒక్కొక్కరు తప్పుకుంటుండగానే.. మరోవైపు త్రివిక్రమ్ తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మహేష్ ఓ భారీ షెడ్యూల్లో పాల్గొన్నాడట. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ ఓ స్పెషల్ బ్యాక్‌గ్రౌండ్ బీట్‌ను రెడీ చేశారట. థమన్ ఓ రేంజ్లో ఈ పాటను సిద్దం చేశాడట. అలవైకుంఠపురంలో సిత్తరాల సిరపడు తరహాలా మాస్ ట్రీట్ పక్కా అని ఇన్సైడ్ టాక్. మహేష్‌కు కూడా ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తెగ నచ్చేసిందని సమాచారం. ఇక మహేష్ బర్త్‌డేకు పస్ట్ సింగిల్ వస్తుందని ఆశ పడ్డ ఫ్యాన్స్‌ను మేకర్స్ మేకర్స్ తీవ్రంగా నిరాశపరిచి.. ఓ బర్త్‌డే పోస్టర్‌తో సరిపెట్టుకున్నారు.
ఈ సినిమాకు ఇంకా 80 రోజులు షూటింగ్ బాకీ ఉందట. ఆదివారం నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుగనుందని సమాచారాం. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లు ఇలా పక్కాగా ప్లాన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి దింపాలని చూస్తున్నారట. శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు.