Gunasekhar |హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా శాకుంతలం తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) ఎలాంటి సినిమా చేయబోతున్నాడోనని మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. కొత్త సినిమా అప్డేట్ అందించాడు.
కొత్త సినిమాకు యుఫోరియా (Euphoria) టైటిల్ ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షార్ట్ టైటిల్ వీడియోను షేర్ చేశారు. యూత్ ఫుల్ సోషల్ డ్రామా నేపథ్యంలో సమకాలీన సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమా ఉండబోతుంది.
హోం బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్‌పై నీలిమ గుణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. ఈ సారి ఎవరూ టచ్ చేయని సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని అర్థమవుతోంది. యుఫోరియాతో గుణశేఖర్ మళ్లీ కమర్షియల్ సినిమా రూట్లోకి రాబోతున్నట్టు అర్థమవుతోంది. మేకర్స్ త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నారు.
యుఫోరియా షార్ట్ టైటిల్ వీడియో..