హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం రాత్రి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరిహిల్స్లోని ఆయన కార్యాలయాల్లో రెండు బృందాలు తనిఖీలు చేపట్టాయి.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన ‘కన్నప్ప’ సినిమా బడ్జెట్ విషయంలో జీఎస్టీ ఎగ్గొట్టినట్టు అనుమానంతో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది. జీఎస్టీ దాడులపై విష్ణు మాట్లాడుతూ తాను కన్నప్ప రిలీజ్ విషయంలో బిజీగా ఉన్నానని, మీడియా చెప్పే వరకు సోదాల విషయం తనకు తెలియదని పేర్కొన్నారు.