శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘45’. అర్జున్ జన్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉమా రమేష్ రెడ్డి, ఎం.రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. బుధవారం టీజర్‌ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌ప్లే రానటువంటి కాన్సెప్ట్ ఇదని, సనాతన ధర్మం గురించిన అంశాలు కూడా ఉంటాయని నిర్మాత తెలిపారు. నేటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, క్లాస్..మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే అన్ని అంశాలుంటాయని ఉపేంద్ర చెప్పారు. దర్శకుడు తనకు ఈ కథను నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు చెప్పాడని, అందుకే 45 అని టైటిల్ పెట్టామని శివరాజ్ కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి కథ, సంగీతం, దర్శకత్వం: అర్జున్ జన్యా.