Govinda’s Wife Sunita Ahuja | బాలీవుడ్ దిగ్గజ నటుడు గోవిందా తన భార్య సునీత అహుజాతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. 1987లో పెళ్లి చేసుకున్న ఈ జంట తమ 37 ఏండ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు… గోవిందా & సునీతా అహుజా కొంతకాలంగా విడిగా జీవిస్తున్నారని, వారి వైవాహిక జీవితంలో తలెత్తిన కొన్ని సమస్యల కారణంగా విడాకుల వైపు అడుగులు వేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై గోవిందా స్పందిస్తూ.. మీడియాలో వస్తున్న వార్తలన్ని అబద్దం. నా ఇంటికి వచ్చేవారంతా బిజినెస్ పనుల్లో భాగంగా.. సినిమా పనుల్లో భాగంగా వస్తున్నారు. అంతేగాని విడాకుల కోసం కాదంటూ గోవిందా వెల్లడించారు. దీంతో ఈ వివాదం సద్దమణిగింది.
ఇదిలావుంటే తాజాగా ఈ విషయంపై తొలిసారి స్పందించింది గోవిందా భార్య సునీత అహుజా.. అమె మాట్లాడుతూ.. గోవిందా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా కూతురు పెరుగుతోంది. దీంతో అతడిని కలవడానికి చాలా మంది ఇంటికి వచ్చేవాళ్లు. అప్పుడు ఇంట్లో నాతో పాటు నా కూతురు సాధారణ దుస్తులు ధరించడం వలన అసౌకర్యాన్ని గురయ్యాం. దీంతో వెంటనే మా ఇంటికి ఎదురుగా ఒక ఆఫీస్‌ను తీసుకున్నాం. అంతే తప్ప మా ఇద్దరికి ఎలాంటి సమస్యలు లేవు. అలాగే ఈ ప్రపంచంలో ఎవరైనా నన్ను, గోవిందాని విడదీయడానికి ధైర్యం చేస్తే, వారు మా ముందుకు వచ్చి సవాల్ విసరాలి.. నన్ను, నా భర్తను విడదీసే ధైర్యం ఎవరికీ లేదంటూ సునీత చెప్పుకోచ్చింది.