Goutham Vasudev Menon | గౌతమ్ మీనన్ దర్శకత్వంలో.. రామ్ పోతినేని నెక్స్ట్ చిత్రం?
Goutham Vasudev Menon Next Film | తమిళంతో పాటు తెలుగులోనూ సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులలో గౌతమ్ వాసుదేవ మీనన్ ఒకడు. 'ఘర్షణ', 'ఏమాయ చేశావే' వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Goutham Vasudev Menon Next Film | తమిళంతో పాటు తెలుగులోనూ సమానంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకులలో గౌతమ్ వాసుదేవ మీనన్ ఒకడు. ‘ఘర్షణ’, ‘ఏమాయ చేశావే’ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ వస్తున్నాయి. ఈయన ప్రేమకథలకు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. లవ్ స్టోరీస్‌ను అందంగా, పోయేటిక్‌గా చెప్పడం ఈయన ప్రత్యేకథ. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన ‘తాంధు వెనిందాతు కాదు’ మూవీ తమిళంలో గురువారం విడుదలైంది. తెలుగులో సెప్టెంబర్ 17న విడుదల కానుంది. శింబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో విడుదల కానుంది.
ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన తదుపరి చిత్రం హీరో రామ్‌తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ళనుందట. తెలుగులో ఈయనకు ఇది 5వ సినిమాగా తెరకెక్కనుంది. దీనితో పాటు విక్రమ్‌తో ‘ధృవ నక్షత్రం’ సినిమాపై కూడా క్లారిటీ ఇచ్చాడు. మరో మూడు, నాలుగు నెలల్లో సినిమా విడుదల కాబోతుందని వెల్లడించాడు. గౌతమ్ మీనన్ ఓ వైపు దర్శకుడిగా సినిమాలను తెరకెక్కిస్తూనే మరోవైపు నటుడిగా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘సీతారామం’లో మేజర్ సెల్వన్‌గా నటించిన విషయం తెలిసిందే.
Read Also:
Prabhas | టాలీవుడ్ నెంబర్.1 హీరోగా ప్రభాస్?
Chiru156 Movie | చిరు-వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కాన్సిల్ అయిందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

