గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రాలయం ప్రొడక్షన్స్ పతాకంపై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు. ‘హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. గోపీచంద్‌ను మునుపెన్నడూ చూడని విధంగా కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది.
విదేశాల్లోని సుందరమైన లొకేషన్లలో అధిక భాగం చిత్రీకరణ జరుపబోతున్నాం. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్, స్క్రీన్‌ప్లే: గోపీమోహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, నిర్మాత: వేణు దోనెపూడి, రచన-దర్శకత్వం: శ్రీను వైట్ల.