Good luck sakhi movie on OTT | కీర్తిసురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గుడ్‌లక్ సఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో ఎ వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర, శ్రావ్యవర్మ సంయుక్తంగా నిర్మించారు. జనవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షోనుంచే డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. జగపతి బాబు కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 12 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.