NV Prasad | ‘గాడ్ ఫాదర్’లో సర్ప్రైజ్ ఉండబోతుంది: నిర్మాత ఎన్వీ ప్రసాద్
పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న గాడ్ ఫాదర్ (Godfather). మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కుతుంది. హైదరాబాద్‌లోని స్టార్ హోటల్లో ఇవాళ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్టు గాడ్ ఫాదర్ (Godfather). పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రం మోహన్ రాజా (Mohan Raja)దర్శకత్వంలో తెరకెక్కుతుంది. హైదరాబాద్‌లోని స్టార్ హోటల్లో ఇవాళ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వి ప్రసాద్ (NV Prasad) మాట్లాడుతూ..గాడ్‌ఫాదర్‌లో ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందన్నారు. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో టీమ్ సర్ప్రైజ్ను రివీల్ చేయాలనుకున్నారని, అలా చేయకుండా ఆపేశానని అన్నారు.
ఆ సర్ప్రైజ్ ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలని ఎన్వి ప్రసాద్ సూచించారు. గాడ్ ఫాదర్ చిత్రంలో ముఖ్యంగా మూడు సన్నివేశాలు అభిమానులను ఉర్రూతలూగిస్తాయన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్ కీ రోల్ చేస్తున్నాడని తెలుస్తోండగా..ట్రైలర్‌తో మాత్రం పూరీ వాయిస్ ఓవర్‌తో మాత్రమే సరిపెట్టాడు. మరి పూరీ సిల్వర్ స్క్రీన్‌పై చిరుతో కలిసి మెరుస్తాడా..? అన్నది చూడాలి.
ఇటీవలే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి దీంతోపాటు మెహర్ రమేశ్ డైరెక్షన్లో భోళా శంకర్, బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) సినిమాలు కూడా చేస్తున్నాడు.
'Ee cinema lo 3 surprise scenes unnayi, repu theatres lo enjoy cheyandi'
Producer @ProducerNVP Speech at the #GodFather Grand Press Meet
– https://t.co/J4g2OpZg1V#GodFatherOnOct5th
Megastar @KChiruTweets @BeingSalmanKhan #Nayanthara @jayam_mohanraja @ActorSatyaDev @MusicThaman pic.twitter.com/VDsf2Tz88I— Konidela Pro Company (@KonidelaPro) October 4, 2022
Read Also : Hari Hara Veera Mallu | స్పీడు పెంచిన క్రిష్..‘హరిహర వీరమల్లు’పై తాజా అప్డేట్
Read Also : O Pari music video | దేవీ శ్రీ ప్రసాద్ పాన్ ఇండియా మ్యూజిక్ వీడియో అదిరింది..
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

