దాదాపు మూడేళ్ల విరామం తర్వాత నయనతార తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’లో ఆమె కీలక పాత్రను పోషిస్తున్నది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి, ఎన్వీప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం నయనతార ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె సత్యప్రియ జైదేవ్ అనే పాత్రలో కనిపించనుంది.
సంప్రదాయ వస్త్రధారణలో ఆమె లుక్ ఆకట్టుకునేలా ఉంది. ధైర్యం, పట్టుదల మూర్తీభవించిన మహిళాగా సత్యప్రియ జైదేవ్ వ్యవస్థపై చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ సినిమా తాలూకు మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. సల్మాన్‌ఖాన్, పూరి జగన్నాథ్, సత్యదేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీరవ్‌షా, సంగీతం: తమన్, ఆర్ట్: సురేష్ సెల్వరాజన్, నిర్మాణ సంస్థలు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా.