Ghoomer Movie Trailer | ఇండియాలోని ఫినెస్ట్ దర్శకులలో ఆర్. బాల్కి ఒకరు. ఆయన సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా ఆడవు కానీ.. కంటెంట్ వైజ్‌గా బ్లాక్ బస్టర్ బొమ్మలే. తీసింది ఆరు సినిమాలే. కానీ ప్రతీ సినిమా ఓ ఆణిముత్యమే. ప్రస్తుతం ఆయన గూమర్ అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దివ్యాంగురాలైన ఓ క్రీడాకారిణిని విజయవంతమైన క్రికెటర్‌గా మార్చే కోచ్ పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపించనున్నాడు. క్రీడాకారిణిగా సయామి ఖేర్ నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
జీవితం అనేది లాజిక్‌తో ఆడే ఆట కాదు.. మేజిక్‌తో ఆడే ఆట అంటూ అభిషేక్ బచ్చన్ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. క్రికెట్ జట్టులో తన బ్యాటింగ్, బౌలింగ్‌తో చెలరేగే ఓ క్రీడాకారిణి అనుకోని పరిస్తుతుల్లో తన చేయి పొగోట్టుకుంటుంది. దాంతో తన క్రికెట్ ఆడలేనని, చనిపోతానని పదే పదే అంటూ ఉంటుంది. కోచ్‌గా అభిషేక్ తనకు మనోధైర్యాన్ని అందించి మంచి బౌలర్‌గా రెడీ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనే ఇంట్రెస్టింగ్ కథతో సినిమా ఉండబోతుందని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఎన్నో సార్లు చూసిన కథలానే అనిపించినా.. ట్రైలర్లో కొన్ని సీన్లు మాత్రం ఎమోషనల్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. అభిషేక్ బచ్చన్ కోచ్ పాత్రలో జీవించినట్లు ట్రైలర్‌తో తెలుస్తుంది. ఇక క్రికెటర్‌గా సయామి ఖేర్ సైతం తన పాత్రతో ఆశ్చర్యపరచడం ఖాయమని ఇన్సైడ్ టాక్.
ఆగస్టు 18న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై హిందీ నాట మంచి హైపే నెలకొంది. పైగా ట్రైలర్లో అమితాబ్ కూడా కనిపించడం సినిమాపై బజ్ మరింత పెరింగింది. అమితాబ్ కీలక రోల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.