Geethanjali Malli Vachindi | నవ్విస్తూ భయపెడుతున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్
Geethanjali Malli Vachindi | తెలుగు హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది.
Geethanjali Malli Vachindi | తెలుగు హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi). 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కథనాయకుడిగా నటిస్తుండగా.. సత్యం రాజేశ్, షకలక శంకర్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిస్తుండగా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు.. ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మూవీ నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ గమనిస్తే.. మొదటి పార్ట్‌లో లాగానే ఈ సినిమాలో కూడా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా నటిస్తుండగా.. హార్రర్ సినిమా తీద్దామని అంజలి, తన టీమ్‌తో కలిసి ఒక పాడుబడిన భవంతిలోకి వెళతారు. అయితే ఆ భవంతీలో షూటింగ్ జరుగుతుండగా.. వారికి దెయ్యాలు ఉన్నట్లు అనుకొని సంఘటనలు ఎదురవుతుంటాయి. అయితే ఆ ఇంట్లో ఉన్న మూడు దెయ్యాలు ఎక్కడివి.. వారికి ఏం జరిగింది. ఈ క్రమంలోనే అంజలి అండ్ టీమ్ ఏం చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కామెడీ అండ్ హార్రర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ ఇతర నటీనటులు కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎంవీవీ సినిమాస్ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

