Geethanjali Malli Vachindi | 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’. భయపెడుతూనే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే చిత్రం రానున్న విషయం తెలిసిందే. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టైటిల్ పాత్రను అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 11 రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఇక రన్‌టైం విషయానికి వస్తే.. ఈ మూవీ 2 గంటల 20 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తుంది. కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచే ఈ సీక్వెల్ మొదలవుతుందని టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది.
Get Ready for 𝗨nlimited entert𝗔inment!! 🤘#GeethanjaliMalliVachindhi now censored with U/A certificate, promises laughs and scares for all ages 👻🔥#GMVTrailer Trending Now on YouTube 👇https://t.co/FhJhKhNuWz
Grand Release worldwide on April 11th#GMVOnApril11 #Anjali50… pic.twitter.com/e2NiG22Tif
— Vamsi Kaka (@vamsikaka) April 6, 2024