ఆదర్శ్, చిత్ర శుక్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గీత సాక్షిగా’. ఈ చిత్రానికి కథను అందిస్తూ చేతన్ రాజ్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు చేతన్ రాజ్. అంథోనీ మట్టిపల్లి దర్శకుడు. ఈ నెల 22న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో విడుదల చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ…‘వాస్తవ ఘటనల ఆధారంగా ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ సినిమా మీద అంచనాలు తీసుకొచ్చింది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేలా సినిమా ఉంటుంది. చేయని తప్పుకు శిక్ష ఎదుర్కొనే యువకుడి పాత్రలో హీరో ఆదర్శ్ నటన ఆకట్టుకుంటుంది. లేడీ లాయర్ పాత్రలో చిత్ర శుక్ల నటన మెప్పిస్తుంది’ అన్నారు. రూపేష్ శెట్టి, చరిష్మా, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : వెంకట్ హనుమ నారిశెట్టి, సంగీతం : గోపీ సుందర్.